Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పంటలు కోయక ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదం డరెడ్డి,రాష్ట్ర చైర్మెన్ అన్వేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్‌లో వారు విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణలో కోతలు కోసి 50 రోజులు అవుతుందనీ,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ప్రణాళికలు రూపొందిం చడంలేదని విమర్శించారు.రాష్ట్రంలో వరి ధాన్యం విషయంలో విచిత్రమైన పరిస్థితి నెలకొందన్నారు.పార్లమెంట్,రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు గందరగోళం చేశారనీ, మిగిలిన ధాన్యం కొనుగోళ్లపై రైతులకు ఎటువంటి హామీలు ఇవ్వలేదని విమర్శించారు.ఇప్పుడు కేంద్రం కొనుగోలు చేయడం లేదంటున్నారని చెప్పారు.చివరికి ధాన్యాన్ని దళారులకు అమ్మేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతి గింజా కొంటామని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్ ధాన్యం చేతికొచ్చాక కొనకుండా ఎక్కడికి పోయారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ప్రశ్నించారు. మర్రి చెన్నారెడ్డి మానవవ నరుల అభివృద్ధి సంస్థలో 70ఏండ్ల ప్రకాష్‌రావుకు డైరెక్టర్, జీఎం(ఆర్థిక) పోస్టింగ్ ఎలా ఇస్తారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్కజడ్సన్ ప్రశ్నించారు.