Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సూటి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బియ్యం ఇస్తే తీసుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందా? అని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు పెరుగుతుంటే కేంద్రం గడువు కుదిస్తున్నదని ఆయన విమర్శించారు. ఇప్పటికే ఎఫ్ సీఐ గోదాముల ముందు 720 లారీలు నిలిచిపోయాయని చెప్పారు. గతేడాది కంటే ర్యాక్ మూమెంట్ 23 శాతం తగ్గించటం ద్వారా కేంద్రం సమస్యలు సృష్టిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ప్రకారం బియ్యం ఇవ్వలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో చేసిన ప్రకటనను మారెడ్డి ఖండించారు. తనిఖీల పేరుతో మిల్లింగ్ నిలిపేసి, బియ్యం నిల్వకు గోదాములు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు.