Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 156 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 25,693 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. మరో 1,372 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,787 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 54 మందికి కరోనా సోకింది. రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో సోమవారంతో పోలిస్తే మంగళవారం జీహెచ్ఎంసీతో సహా 16 జిల్లాల్లో కేసులు పెరిగాయి. ఆదిలాబాద్, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నల్లగొండ, నారాయణపేట, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, హనుమకొండ జిల్లాల్లో కేసులు పెరిగాయి.