Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ బాల్క సుమన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్... ఎస్సీ, ఎస్టీల భూములను కబ్జా చేశారనే విషయం కలెక్టర్ రిపోర్టులో తేలిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఈ నేపథ్యంలో తప్పు చేసిన ఈటల... తన ముక్కును నేలకు రాసి, క్షమాపణ కోరాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌తో కలిసి సుమన్ మాట్లాడారు. ఇప్పటికైనా హుజూరాబాద్ ప్రజలు ఈటల తీరును, వ్యవహారశైలిని గమనించాలని ఆయన కోరారు. రాబోయే రోజుల్లో ఆయనపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కబ్జాకోరు అయిన ఈటలను...సస్పెండ్ చేయాలంటూ బీజేపీని కోరారు.