Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ స్టడీ సర్కిల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం కోచింగ్ క్లాసులు నిర్వహించనున్నట్టు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ న్.బాలాచారి తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం స్టడీ సర్కిల్ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
హాల్ టికెట్లు....
సివిల్స్ -2022 కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 11న జరిగే స్క్రీనింగ్ టెస్ట్ కోసం హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మొత్తం 3064 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఈ నెల 11న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకు రెండు షిప్టుల్లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు.