Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇసుక మాఫియాను శిక్షించాలి
- బాధిత కుటుంబానికి రూ.20 లక్షలివ్వాలి : డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏల అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కడ్గావ్లో విధినిర్వహణలో భాగంగా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వీఆర్ఏ గౌతమ్‌ను కొట్టి హత్యచేసిస ఇసుక మాఫియాను కఠినంగా శిక్షించాలని డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి బాపుదేవ్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలనీ, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఆర్థిక ఇబ్బదులతో ముగ్గురు వీఆర్ఏలు చనిపోయారనీ, వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత లేదని వాపోయారు. జాబ్ చార్ట్ లేకపోవడం వల్ల గొడ్డుచాకిరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఏలకు పేస్కేలు వర్తింపజేయాలనీ, హెల్త్‌కార్డులు పనిచేసేలా చూడాలని కోరారు.