Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టియుఎంహెచ్ఇయూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 104 ఎఫ్ డీహెచ్ఎస్ (ఫిక్స్డ్ డే హెల్త్ సర్వీసెస్) సేవలను కొనసాగించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టియుఎంహెచ్ఇయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపాల్, కె.యాదానాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. 2008 నుంచి ఈ స్కీమ్ అమలవుతున్నదనీ, ప్రతి గ్రామానికి నెలకు ఒకసారి104 వాహనం వెళ్లి గర్బిణీలకు, చిన్న పిల్లలకు, వృద్ధులకు ముఖ్యంగా బీపీ,షుగర్, ఆస్తమా, క్యాన్సర్, మూర్ఛ తదితర దీర్ఘకాలిక రోగాలకు, మలేరియా,క్షయ తదితర అంటువ్యాధులకు నిరంతరం చికిత్సనందిస్తున్నాయని తెలిపారు. ఈ సేవల రద్దు నిర్ణయంతో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు దూరమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 13 ఏండ్లుగా సేవలందిస్తున్న 1,250 మంది సిబ్బంది భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని, ఉద్యోగ భద్రత పోతుందని విమర్శించారు. వృద్ధు లు దూర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేయించుకుని, మందులు తీసుకోవటం చాలా కష్టంతో కూడుకున్న పని అని వారు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో 104 సేవలను కొనసాగించి, సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.