Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బొగ్గు బ్లాకుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 9,10,11 తేదీల్లో జరిగే సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ సమ్మెకు తెలంగాణలోని యావత్ కార్మికవర్గమంతా సంఘీభావం తెలపాలని సీఐటీ యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చుక్క రాములు,ఎమ్.సాయిబాబు పిలుపుని చ్చారు. మేధావులు, ప్రజాతంత్రవాదులందరూ అండగా నిలవాలని కోరారు.
వీఆర్ఏ గౌతమ్ కుటుంబాన్ని ఆదుకోవాలి...
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కడ్గావ్ గ్రామ వీఆర్ఏ గౌతమ్‌ను సంబంధిత మాఫియా హత్య చేయటాన్ని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు నిరసనగా వారంపాటు కార్యక్రమాలను నిర్వహించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.బాలనర్సయ్య, వంగూరు రాములు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. హత్యకు కారణమైన మాఫియాను కఠినంగా శిక్షించాలనీ, బాధితుడి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియోనివ్వాలని డిమాండ్ చేశారు.