Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ ఉద్యోగులకు ఎమ్డీ సజ్జనార్ కొత్త టాస్క్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
వాలంటైన్స్ డే, ఉమెన్స్ డే, మెన్స్ డే, చిల్డ్రన్స్ డే, ఎన్విరాన్మెంట్ డే...ఇలా ఏటా అనేక 'డే' లు జరుపుకుంటున్నాం. ఇప్పుడు తాజాగా 'బస్ డే' వచ్చింది. టీఎస్ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్ ఈ 'బస్ డే'ను సృష్టించారు. కాకపోతే దీన్ని ఆయన తమ సంస్థ ఉద్యోగుల కోసం సృష్టించారు. ఆర్టీసీ ఉద్యోగులందరూ ఇకపై ప్రతి గురువారం తప్పనిసరిగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలంటూ ఆయన నిబంధన విధించారు. ఈనెల 9వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. సంస్థలోని కిందిస్థాయి ఉద్యోగులు మొదలు, ఉన్నతస్థాయి అధికారుల వరకు అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు. దీనివల్ల సంస్థపై ప్రయాణీకులకు మరింత నమ్మకం, విశ్వాసం పెరుగుతాయన్నారు. క్షేత్రస్థాయిలో ప్రయాణీకుల సమస్యలు కూడా ఆర్టీసీ సిబ్బంది, అధికారులకు తెలుస్తాయనీ, ఫలితంగా సేవల మెరుగుదలకు అవకాశం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిబంధన అన్ని స్థాయిల సిబ్బంది, అధికారులకు వర్తిస్తుందన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే ఆర్టీసీ లక్ష్యమని స్పష్టం చేశారు.