Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరూ ...దయ చూపండి : మంత్రి హరీశ్‌కు కిడ్నీ రోగుల వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిడ్నీ బాధితులకు నెలకు రూ.10 వేల పెన్షన్ ఇస్తున్నట్టుగానే రాష్ట్రంలోనూ ఇచ్చి ఆదుకోవాలని తెలంగాణ కిడ్నీ పేషెంట్స్ వెల్పేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.ఈ మేరకు మంగళవారం అసోసి యేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్.మోహన్ ఆధ్వర్యంలో నాయకులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి వినతి పత్రం సమర్పిం చారు. జీవచ్ఛవాలుగా బతుకున్న తమకు జీవనాధారం లేకపోవడంతో తమతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గోడు వెళ్లబోసుకున్నారు.ఈ నేపథ్యంలో తమకు జీవిత బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.ఒకవైపు పని లేక వైద్యంతో పాటు ఇంటి ఖర్చులు భరించలేక,తమ తదనంతరం కుటుంబాలు ఏమవుతాయనే ఆలోచనతో మానసికంగా వేదనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ తరపున ఇది వరకే సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులకు, రాష్ట్ర మాజీ వైద్యారోగ్యశాఖ మంత్రులకు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు.