Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సుస్థిరాభివృద్ధికి భౌగోళిక సాంకేతిక పరిజ్ఞానం కీలకమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన 'జియోస్మార్ట్ కాన్ఫరెన్స్ - 2021' ఎడిషన్లో ఆమె భారత ఆర్థిక వ్యవస్థలో జియోస్పేషియల్ నాలెడ్జ్ యొక్క పాత్రను అభివృద్ధి చేయడం అనే అంశంపై ప్రసంగించారు. ఈ సాంకేతికతను సరిగ్గా ఉపయోగిస్తే వ్యవసాయం, రవాణా, రక్షణ, అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో భౌగోళిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలని సూచించారు. మ్యాపింగ్, సర్వేయింగ్,రిమోట్ సెన్సింగ్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వంటి జియోస్పేషియల్ టెక్నాలజీల్లో వస్తున్న మార్పులను గుర్తుచేశారు. దీనిపై దేశవ్యాప్తంగా సంస్థలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని హాజరయ్యారు.