Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక సంఘాలు, భూ నిర్వాసితుల నిరసన ర్యాలీ
నవతెలంగాణ-టేకులపల్లి
కోయగూడెం ఓపెన్ కాస్ట్(ఓసీ)-3 బొగ్గు బ్లాక్ వేలాన్ని ఆపి.. సింగరేణి సంస్థకు ఇవ్వాలని కార్మిక సంఘాల నేతల, భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. మంగళవారం ఓసీ -3 పరిశీలనకు కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులు వస్తున్నారని తెలుసుకొని పెద్దఎత్తున కార్మిక సంఘాల నాయకులు,భూ నిర్వాసితులు తరలివచ్చి నిరసన తెలిపారు. ప్రాజెక్టు కార్యాలయం నుంచి ఓసీ-3 భూముల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో నేతలు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బొగ్గుగనుల ప్రయివేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి రక్షణ కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రయివేట్ సంస్థలకు అప్పగిస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. టీబీజీకేఎస్ రాష్ట్ర నాయకులు కెంగెర్ల మల్లయ్య, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు, ఏఐటీయూసీ డిప్యూటీ కార్యదర్శి కె.సారయ్య, బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి పి.మాధవ్ నాయక్,భూ నిర్వాసితుల రాష్ట్ర నాయకులు రేపాకుల శ్రీనివాస్, ఐఎన్టియుసి ఇల్లందు ఏరియా ఉపాధ్యక్షులు ఎస్డి మహబూబ్, బిఎఫ్టియు రాష్ట్ర నాయకులు రాసుధ్ధీన్,జె.సీతారామయ్య, డి.ప్రసాద్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంగనాధ్, బొల్లెద్దు ప్రభాకర్, అశోక్, సంజీవరావు,రాజారాం,శంకర్, భాస్కర్, నాయిని సైదులు, నరేంద్ర బాబు, చందర్, వీరన్న, రమేష్ పాల్గొన్నారు.