Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీపీఆర్‌కు సీఎం ఆమోదం తర్వాత పనులు
- పట్ణణ ప్రాంతాల చుట్టు కూరగాయల సాగుపై దృష్టి
- యాసంగిలో పంటల మార్పిడి తప్పనిసరి : మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కొత్తపేట పండ్ల మార్కెట్ స్థానంలో కోహెడలో అంతర్జాతీయ స్థాయి వసతులతో కోహెడలోనే మార్కెట్‌ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డినిరంజన్‌రెడ్డి చెప్పారు. డీపీఆర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.మంగళవారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని మార్కెటింగ్ కార్యాలయంలో మార్కెటింగ్, ఉద్యాన శాఖ, వేర్ హౌసింగ్, మార్క్‌ఫెడ్, హాకా సంస్థలపై మంత్రి సమీక్షించారు. కొల్లాపూర్‌లో మామిడి మార్కెట్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని మార్కెట్లలో వసతులు కల్పించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. యాసంగిలో పంటల మార్పిడి పెద్ద ఎత్తున జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పప్పుగింజలు, నూనె గింజలు అధికంగా సాగు చేయాలని మార్కెట్ రీసెర్చ్ అనాసలిస్ విభాగం సూచించిందని వివరించారు. సాగు చట్టాలను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో గతంలో ఉన్న వ్యవసాయ చట్టం, నిబంధనల ప్రకారం వ్యవసాయ మార్కెట్లను మరింత పటిష్టం చేయాలని కోరారు. వ్యవసాయ మార్కెట్లలో మార్కెట్ఫీజు పకడ్బందీగా వసూలు చేయాలన్నారు. చెక్‌పోస్టులను బలోపేతం చేయాలన్నారు. వేర్‌హౌసింగ్ గోదాముల నిర్మాణాన్ని వేగవంతం చేయాలనీ, ఎటువంటి ఇబ్బందులున్నా వెంటనే తన దృష్టికి తీసుకరావాలని సూచించారు. 'అంతర్జాతీయ మార్కెట్లో ఏడాదికి 20వేల మెట్రిక్ టన్నుల శ్రీగంధానికి డిమాండ్ ఉంది.దాని సాగు వైపుకు రైతులను ప్రోత్సహించాలి. అవసరమైతే శ్రీగంధం అమ్ముకొనేందుకు అటవీ నిబంధనలు సరళతరం చేస్తాం' అని మంత్రి పేర్కొన్నారు.యాసంగి సాగుకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలు ముఖ్యంగా డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల వివరాలను నిత్యం తెప్పించుకుని అధికారులు పర్యవేక్షించాలనీ, హాకా పటిష్టతకు అధికారులు కార్యాచరణ రూపొందించాలని కోరారు. ఉద్యాన పంటల అమ్మకాలలో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల మార్కెట్లను అధ్యయనం చేసి రైతులకు లాభం కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు వేదికల్లో అన్నదాతలకు సమగ్ర సమాచారం అందుబాటులో ఉంచామని తెలిపారు. వరంగల్, ఖమ్మంలో మిరప ట్రేడింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలలకు నిత్యావసర వస్తువులు సరఫరా దిశగా హాకా ఆలోచించాలని సూచించారు. ఆ దిశగా వెంటనే దష్టిసారించి నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషనర్ రఘనందన్‌రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మిబాయి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్రెడ్డి తదితరులు ఉన్నారు.