Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లీబిడ్డా క్షేమం
నవతెలంగాణ-సిద్దిపేట
ప్రయాణంలో ఉన్న నిండు గర్భిణి.. పురిటి నొప్పులతో బాధపడు తుండగా.. బంధువు లు, తోటి ప్రయాణికులే ఆర్టీసీ బస్సులోనే పురుడు పోశారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే..ఒడిషా రాష్ట్రానికి చెందిన గణేష్ భార్య జయంతి, కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి ఆసిఫాబాద్‌కు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. జయంతి నిండు గర్భిణి. అయితే, బస్సు సిద్దిపేట పట్టణంలోని వేములవాడ కమాన్ సమీపంలో గల న్యూ హైస్కూల్ వద్దకు రాగానే జయంతికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు తోటి ప్రయాణికుల సాయంతో పురుడు పోయగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించండతో వారు అక్కడికి చేరుకుని బిడ్డ నుంచి తల్లి పేగును వేరేచేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్టు 108 సిబ్బంది తెలిపారు.