Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి
- మేడిన్ ఇండియా, మేడిన్ హైదరాబాద్‌గా ఫైటర్ వింగ్ తయారీ
- పారదర్శకంగా టీఎస్ఐపాస్ పురోభివృద్ధి :తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు
నవతెలంగాణ -రంగారెడ్డి ప్రతినిధి
టాటా-లాక్‌హీడ్ మార్టిన్ భాగస్వామ్యం శుభపరిణామమని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో టాటా ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ ఫైటర్ వింగ్స్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఐదేండ్లలో పారిశ్రామికంగా రాష్ట్రం మంచి అభివృద్ధి సాధించిందన్నారు. హైదరాబాద్‌లోని టీఎల్ఎంఏఎల్ సదుపాయం వద్ద ఫైటర్ వింగ్ షిప్ సెట్ స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాన్ని వెల్లడించిన లాకేడ్ మార్టిన్.. టీఎల్ఎంఏఎల్తో భాగస్వామ్యం అయిందన్నారు. ఈ భాగస్వామ్యం దేశ రక్షణ తయారీ సామర్థ్యానికి మద్దతునివ్వడానికి లాకోడ్ మార్టిన్ నిబద్ధతను ఎంతో ప్రతిధ్వనిస్తుందని చెప్పారు. టీఎల్ఎంఏఎల్తో లాక్డ్ మార్టిన్ భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా సాంకేతికంగా ముందడుగు వేసిందన్నారు. మేడిన్ హైదరాబాద్‌గా ఫైటర్ వింగ్స్ తయారు చేశారన్నారు. హైదరాబాద్ ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకోసిస్టమ్ తక్కువ సమయంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగాయనడానికి ఎఫ్-16 వింగ్ సర్టిఫికేషన్, డెలివరీ గొప్ప సాక్ష్యంగా నిలిచాయన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి టాటా, లాక్‌హీడ్ మార్టిన్ చేసిన నిరంతర సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ రెండు రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఇండియాలోనే తెలంగాణ అత్యంత చురుకైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రగతిశీల విధానాలు, మౌలిక సదుపాయాలతో ఈ రంగం ఐదేండ్లలో అపూర్వమైన వృద్ధిని సాధించిందని స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్‌తో రాష్ట్రం వేగంగా, పారదర్శకంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఏరోస్పేస్ సెక్టార్లో 2020లో తెలంగాణకు అవార్డు వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. లాకీడ్ మార్టిన్ ఏరోనాటిక్స్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో 2010లో ఏర్పడిన సంస్థ టీఎల్ఎంఏఎల్.. భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్, భారత్ మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు.