Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తమిళిసైకి తెలంగాణ రైతుసంఘం లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వచ్చే రబీలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందనీ, దీంతో రాష్ట్ర రైతాంగం తీవ్రమైన ఆందోళనలో ఉన్నదని తెలంగాణ రైతు సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. వారికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహ్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి టి సాగర్ ఈమేరకు మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ రాశారు.గత రబీలో ఎఫ్‌సీఐ బియ్యాన్ని పూర్తి స్థాయిలో ధాన్యాన్ని సేకరించకపోవడంతో ఇప్పటికీ ఎఫ్‌సీఐ గోదాముల వద్ద బియ్యం లారీలు క్యూలో ఉన్నాయని గుర్తుచేశారు. వానాకాలం ధాన్యాన్ని కూడా డిసెంబరుతో సేకరించబోమని కేంద్రం ప్రకటిం చిందని పేర్కొన్నారు.ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని రైతులకు ఎమ్ఎస్పీ అమలు కాదనీ,దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ధాన్యం సేకరణ బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకునే ప్రయత్నం చేస్తున్నదని వారు పేర్కొన్నారు.
డిమాండ్లు...
- గత రబీలోని బియ్యాన్ని ఎఫ్‌సీఐ పూర్తి స్థాయిలో సేకరించాలి.
- ప్రస్తుత వానాకాలం బియ్యం సేకరణ గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పొడిగించాలి.
- వచ్చే రబీలో బాయిల్డ్ రైస్‌ను షరతులు లేకుండా తీసుకోవాలి.