Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: సమాచార సాంకేతిక చట్టం కొత్త కాల్కోడ్స్ ప్రకారం డిజిటల్ మీడియా సంస్థలపై కోర్టు అనుమతులు లేకుండా ఎలాంటి బలవంతపు చర్యలూ తీసుకోవద్దని మద్రాస్ హైకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఐటీశాఖ తెచ్చిన మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్‌పై ఇండియన్ బ్రాడ్‌కాస్టర్స్, డిజిటల్ మీడియా ఫౌండేషన్ వేసిన ప్రజాహిత వ్యాజ్యం విచారణకు వచ్చిన సందర్భంగా ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కొత్త రూల్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చాయి. తదుపరి విచారణను జనవరి 25కు వాయిదా వేసింది. ఇదిలావుండగా, ఐటీ కొత్త రూల్స్‌పై ఇదివరకు బాంబే హైకోర్టు సైతం స్టే విధిస్తూ ఆగస్టులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.