Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జమ్మికుంట
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద 20రోజులుగా పడి గాపులు కాసిన రైతు చివరకు గుండెపోటు తో అక్కడే ప్రాణం వదిలాడు. ఈఘటన కరీం నగర్ జిల్లా జమ్మి కుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు బిట్ల ఐలయ్య (55) 20 రోజుల కిందట ధాన్యాన్ని ఐకేపీ కొను గోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. ధాన్యం తేమగా ఉండటంతో అధికారులు కొనుగోలు చేయలేదు. దీంతో రోజూ అక్కడికి వచ్చి ధాన్యాన్ని ఆర బోసుకొని కొనుగోలు చేపట్టాలని అధికారులను అడిగేవాడు. మంగళవారం కూడా కొనుగోలు కేంద్రానికి వచ్చిన ఐలయ్య ధాన్యం ఆరబోస్తుం డగా ఒక్క సారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వాస్పత్రికి తర లించారు. విషయం తెలుసుకున్న హుజూరాబాద్ ఆర్డీవో రవీందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శిం చారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతోనే ఆందోళనతో తన భర్త మృతి చెందాడంటూ ఐలయ్య భార్య లక్ష్మి.. ఆర్డీవో ఎదుట వాపో యారు. కేసు దర్యాప్తు చేపట్టినట్టు జమ్మికుంట సీఐ రామచందర్రావు తెలిపారు.