Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
- యాదాద్రి జిల్లా కార్యదర్శి జహంగీర్ ఎన్నిక
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో కులం, మతం పేరుతో చీలికలు తీసుకొస్తూ మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, ప్రాంతాలవారీగా ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సీపీఐ(ఎం) జిల్లా రెండో మహాసభ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడు తూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్, పెట్టుబడిదారులకు అమ్మాలని చూస్తోంద న్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి రైతు పొట్టే యత్నం చేస్తోందన్నారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, యువత, విద్యార్థుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ నియంత పాలన సాగిస్తోందన్నారు.పెట్టుబడిదారీ విధానాన్ని అడ్డుకోవ డానికి వర్గ పోరాటం చేయాలన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ప్రజల కోసం పని చేస్తే తప్పక ఫలితాలుంటాయన్నారు. కమ్యూనిస్టులకు ఓట్లు, సీట్లతో సంబంధం లేదని ప్రజా సమస్యల పరిష్కార మే ఎజెండాగా పని చేస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దేశం దాటితే ఎక్కడా కనిపించవని, ఎర్రజెండా మాత్రం ప్రపంచ మొత్తంలో ఎక్కడైనా కనిపిస్తున్న విషయాన్ని గ్రహించాలన్నారు. జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్ మాట్లాడుతూ.. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య మాట్లాడారు. కొండమడుగు నర్సింహా, మాటూరి బాలరాజు, బట్టుపల్లి అనురాధ, మేక అశోక్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ మహాసభలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి, కల్లూరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కమిటీ ఎన్నిక
మహాసభలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా ఎమ్‌డి.జహంగీర్ రెండోసారి ఎన్నికయ్యారు. ఆయనతో పాటు కొండమడుగు నర్సింహా, మంగ నర్సింహులు, మాటూరి బాలరాజుగౌడ్, కల్లూరి మల్లేశం, దోనూరి నర్సిరెడ్డి, బట్టుపల్లి అనురాధా, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, మేక అశోక్‌రెడ్డి, దొడ్డి అంజయ్యను కార్యదర్శివర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. వీరితో పాటు మరో 24 మందిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.