Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై వామపక్షాలు, టీజేఎస్, టీడీపీ ప్రజాసంఘాల ఆందోళన
- రైతులకు కోపం వస్తే ప్రభుత్వాల పీఠాలు కదులుతరు..
- అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి : తమ్మినేని
- యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి : కోదండరాం
నవతెలంగాణ-మిర్యాలగూడ/మెఫసిల్ యంత్రాగం
ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరి స్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వామపక్షాలు, టీజేఎస్, తెలంగాణ టీడీపీ, తదితర పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వ ర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరి గాయి. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని పార్టీల నేతలు డిమాండ్ చేశారు. 'రైతులకు కోపం వస్తే ప్రభుత్వాల పీటలు కదులుతరు....నేనే గొప్పగా చెప్పుకునే మోడీ రైతు ఉద్యమానికి తట్టుకోలేక చట్టాలను రద్దు చేసుకొని రైతులకు క్షమాపణలు చెప్పిండు.. రైతులు కన్నీరు పెడితే ప్రభుత్వాల పతనం ఖాయం' అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొను గోలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మహా పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర హనుమాన్ పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి రాజీవ్ చౌక్ వరకు సాగింది. అనంతరం పట్టణంలో నిర్వహించిన సభలో తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాంతో కలిసి ఆయన మాట్లా డారు. రైతులు కలిసి కట్టుగా పోరాటం చేయడం వల్లే మోడీ వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకున్నాడని అన్నారు. ధాన్యం కొనే విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొని వెళ్లాలని సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు. ఈ విషయంపై అం దరూ కలిసి మోడీపై ఒత్తిడి తెద్దామన్నారు. బీజేపీ అంటే కేసీఆర్కు భయం ఉందని, అందుకే ఆయన కేంద్ర ప్రభు త్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయడం లేదన్నారు. టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం మాట్లాడుతూ ఐకేపీ కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెల రోజు లు దాటినా ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నిం చారు. యాసంగి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల న్నారు. రైతుల సమస్యలపై ఈ నెల 9న హైదరాబాదులో ధర్నా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, టీడీపీ రాష్ట్ర నాయకులు బండి వెంకటేశ్వర్లు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వరు, టీజేఎస్, సీపీఐ నాయకులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో కుడకుడ ఐకేపీ కేంద్రాన్ని సందర్శించారు. సూర్యాపేట- దంతాలపల్లి రోడ్డుపై రాస్తారోకో చేశారు. నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలోని ఐకేపీ సెంటర్లో, పెద్దవూరలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దేవరకొండలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఐకేపీ సెంటర్ వద్ద ధర్నా చేశారు. నల్లగొండ పట్టణంలోని ఎస్ఎల్బీసీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అఖిలపక్షం, ప్రజాసంఘాలు నిరసన తెలిపాయి. చిట్యాలలో సీపీఐ(ఎం), రైతుసంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన శామీర్పేట వద్ద కొనుగోలు కేంద్రాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సందర్శించారు. ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఐకేపీ చేపట్టిన కొనుగోలు కేంద్రం వద్ద నాయకులు ధర్నా నిర్వహించారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డును సందర్శించిన వామపక్ష పార్టీల నాయకులతో పాటు టీడీపీ, టీజేఏస్ నాయకులు రాస్తారోకో చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని రైస్ మిల్ దగ్గర ఐకేపీ చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు వద్ద సీపీఐ(ఎం) నాయకులు జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. ఉట్కూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకట్రామి రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్, వైరా, తిరుమలాయపాలెం, ఎర్రుపాలెం, రఘనాధపాలెం మండలాల్లో సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీడీపీ, రైతుసంఘం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్లకు వినతిప త్రం అందజేశారు. చింతకానిలో సీపీఐ(ఎం), టీడీపీ, సీపీఐ ఆధ్వర్యంలో చింతకాని సహకార సంఘం ఎదుట ఆందోళన నిర్వహించారు. కరీంనగర్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందు సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమెక్రసీ పార్టీలు నిరసన తెలిపాయి. వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని, డబ్బులు బ్యాంకులు వేయాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా గార్లలో సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) న్యూడెమెక్రసీ పార్టీలు రైతులతో దర్నా చేశారు.