Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రతిష్టాత్మకమైన భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (ఐఐటీ) హైదరాబాద్‌లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు కరాటే కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ కోర్సు చదివే విద్యార్థులకు ఒక క్రెడిట్‌ను ఇస్తామని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి బుధవారం తనను కలిసిన విలేకర్లతో చెప్పారు. విద్యార్థులు ఏదో ఒక సెమిస్టర్లో ఈ కోర్సును ఎంచుకోవాల్సి ఉంటుందని వివరించారు. అందులో భాగంగా విద్యార్థులు 14 గంటలపాటు కరాటే తరగతులకు హాజరై సాధన చేయాలని అన్నారు. ఐఐటీలోని విద్యార్థులకు ఇప్పటికే సంబంధిత క్లాసులు నిర్వహిస్తున్నామని చెప్పారు. 400 మందికిపైగా నేర్చుకుంటున్నారని వివరించారు. అధికారుల ముందు వారు ఒక ప్రదర్శన ఇచ్చారని అన్నారు. విద్యార్థుల్లో ఉండే కళను ప్రోత్సహించడం కోసమే కరాటే కోర్సును ప్రవేశపెట్టేందుకు నిర్ణయించామని చెప్పారు. ఇది శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒత్తిడి నుంచి అధిగమించడానికి ఉపయోగపడుతుందని వివరించారు.