Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ వ్యాపార, ప్రజా కంఠక అనుకూల పార్టీ : మంత్రి కొప్పుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'తీన్మార్ మల్లన్నగా పిలువబడుతున్న చింతపండు నవీన్ యాంకర్ మాత్రమే. ఆయన ఎక్కడా రిపోర్టర్‌గా పనిచేయలేదు. సంఘంలో జర్నలిస్టుకు ఒక హౌదా, గుర్తింపు ఉంది. సంఫ్‌ు పరివార్‌కు చెందిన ఆయన జర్నలిస్టు ముసుగేసుకుని బీజేపీ కోసం పనిచేసిండు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనకుండా టీఆర్ఎస్ సర్కారును బద్నాం చేసే కుట్రకు పూనుకున్నాడు. ఇప్పుడు బీజేపీలో చేరికతో అది నిజమని తేలింది' అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నవీన్ తనకు తాను అతిగా అంచనా వేసుకుని పగటి కలలుకంటున్నారని విమర్శించారు. బ్లాక్‌మెయిళ్లకు పాల్పడినందుకే నవీన్ జైలుపాలయ్యాడని గుర్తుచేశారు. అరాచక, నిరంకుశ పాలనకు బీజేపీ కేరాఫ్ అడ్రస్‌గా ఉందని పేర్కొన్నారు. బాబ్రీమసీదును కూల్చి, గోద్రాలో ముస్లింలను, ఎస్సీలను ఊచకోత కోసి అరాచకానికి పాల్పడింది బీజేపీ కాదా?అని ప్రశ్నించారు. ధన, అధికార దర్పంతో కర్నాటక, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెసు ప్రభుత్వాలను కూల్చి బీజేపీ గద్దెనెక్కింది వాస్తవం కాదా? అని నిలదీశారు. బీజేపీ అనేది ప్రజాకంఠక, వ్యాపారులు, పారిశ్రామికవేత్తల అనుకూల పార్టీ అని విమర్శించారు. అమరవీరుల కుటుంబాలన్నింటినీ సీఎం కేసీఆర్ ఆర్థికంగా ఆదుకోవడమే కాక ప్రభుత్వోద్యోగాలు కూడా ఇచ్చారని తెలిపారు. ఇటీవల నియమితులైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు కారం రవీందర్ రెడ్డి, సత్యనారాయణ, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్, ఉపేంద్రాచారి, సుభప్రద పటేళ్లు ఉద్యమకారులు కాదా?అని నవీన్ ను ప్రశ్నించారు. ఇప్పటికైనా పెద్దవారిని తిట్టడం,హేళన చేయడం మానుకుని సంస్కారంతో మెలగాలని హితవు పలికారు.