Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియా అవార్డ్‌ల ప్రదానం
- పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జర్నలిజం, అడ్వర్టైజ్మెంట్, సర్క్యులేషన్ కేటగిరీల్లో విశేష సేవలను అందిస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఎఫ్.ఎం రేడియో విభాగాల్లోని జర్నలిస్టులు, సిబ్బందిని ఘనంగా సత్కరించాలని హైబిజ్ టీవీ సంకల్పించింది. దీనిలో భాగంగానే ఆ మీడియా అవార్డ్స్-2022 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనవరి 29వ తేదీన హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ వేదికగా పురస్కారాల ప్రదానోత్సవం జరుగనుంది.' హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్-2022'కు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైందనీ, ఆయా రంగాల్లో పని చేస్తున్న వారు హెచ్.ఎం.ఎ పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని హైబిజ్ టీవీ తెలుగు నౌ మేనేజింగ్ డైరెక్టర్ మాడిశెట్టి రాజ్‌గోపాల్ తెలిపారు. www.hybiz.tv/awar.com లింక్ ద్వారా నామినేషన్లను సమర్పించవచ్చని తెలిపారు. హెచ్.ఎం.ఎ-2022 కోసం నామినేష న్లు దాఖలు చేసేందుకు జనవరి 17 చివరి తేదీగా నిర్ణయించినట్టు చెప్పారు. దరఖాస్తులను అపార అనుభవం కలిగిన జ్యూరీ సభ్యులు పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తారనీ,వారిదే తుది నిర్ణయమ న్నారు.అత్యంత పారదర్శకంగా ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుందని వివరించారు. ఈ అవార్డుల ప్రదానా నికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరణ హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్లో ఆవిష్కరిం చారు. ఈ కార్యక్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌హెడ్ అనిల్ కుమార్ , ది హిందూ మాజీ రీజినల్ మేనేజర్ రంగారెడ్డి, ది హిందూ బిజినెస్‌లైన్ మాజీ అసోసియేట్ ఎడిటర్, చీఫ్ బ్యూరో సోమశేఖర్ , ఎక్స్బిజినెస్ డైరెక్టర్ ఇన్షియేటివ్ మీడియాకు చెందిన కె. సత్యనారాయణ, సాక్షి మాజీ అడ్వర్టైజ్మెంట్ రమణకుమార్ పాల్గొన్నారు.