Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వివిధ రంగాల్లో, ప్రక్రియల్లో కృషి చేసిన పలువురిని 2018 ఏడాదిగానూ తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేసింది. రిజి స్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ బుధవారం ఒక ప్రకటనలో వారి పేర్లను ప్రకటిం చారు. రామకవచం వెంకటేశ్వర్లు(కవిత) ఆచార్య వీ. నిత్యానందరావు ( విమర్శ), వోలెటి రంగమని( నాట్యం), డి. ఆనంతయ్య( చిత్రలేఖనం), ఆర్. గంగాధర్( శిల్పం), డాక్టర్ కే. వెంకటాచార్యులు( సంగీతం), కల్లూరి భాస్కరం( పత్రికా రంగం), వెంకట్రాజం గౌడ్(నాటకం), కె.తలారి బాలయ్య( జానపద కళారంగం), ఎమ్. అంజయ్య(అవధానం), ఎస్. అరుణ(ఉత్తమ రచయిత్రి), చంద్రశేఖర్ ఆజాద్ (నవల) ఎంపిక చేసినట్టు తెలిపారు. వారిని విశ్వవిద్యాలయం నిర్వహించే కార్యక్రమంలో రూ. 20,116 నగదు పురస్కారంతో సత్కరిస్తామని తెలిపారు.