Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
కేంద్ర బీజేపీ ప్రభుత్వ విద్యుత్ రంగ ప్రయివేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్ల సమన్వయ కమిటీ పిలుపుమేరకు బుధవారం జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ కేటీపీపీ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విద్యుత్ సవరణ బిల్లు-2021ఆమోదం పొందే యోచనలో ఉన్న దృష్ట్యా ధర్నా చేపట్టినట్టు తెలిపారు.విద్యుత్ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు ధారా దత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు. 70 ఏడ్లుగా ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న విద్యుత్ సంస్థ..దేశంలో 25కోట్లమంది వినియోగదారులు, వ్యవసాయదారులు పరిశ్రమ వర్గాలకు సేవలందిస్తోందన్నారు.