Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్, ఇతర జవాన్లు మరణం పట్ల రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారత సైన్యానికీ, జాతీయ భద్రతకు విశిష్ట సేవలందించిన రావత్ ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించటం పట్ల విచారం వెలిబుచ్చారు. ప్రపంచంలోనే బలమైన సైన్యాల్లో ఒకటిగా భారత సైన్యాన్ని తీర్చిదిద్దడంలో రావత్ అందించిన సేవలు మరువలేనివని కొనియా డారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణీ, పలువురు ఆర్మీ జవా న్లు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటం తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దేశ రక్షణ రంగానికి బిపిన్ చేసిన సేవలను స్మరించు కున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు, టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి, తదితర పార్టీల నేతలు బిపిన్ మరణం పట్ల సంతాపం తెలిపారు.