Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్సీసీఈఈఈ రాష్ట్ర శాఖ ధర్నా, ప్రదర్శన
- విద్యుత్ సౌధలో టీఈఈజేఏసీ ఆందోళన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు-2021ని తక్షణం రద్దు చేయాలని రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, ఇంజినీర్లు డిమాండ్ చేశారు. జాతీయ విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్ల సమన్వయ కమిటీ (ఎన్సీసీఈఈఈ) పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బుధవారంనాడిక్కడి మింట్‌కాంపౌండ్ టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ కార్యాలయం వద్ద భారీ ధర్నా, ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ సౌధలో భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంల పరిధిలోని అన్ని కార్యాలయాల్లోనూ ఉద్యోగులు పలు రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. మింట్‌కాంపౌండ్‌లో జరిగిన ధర్నాకు పి రత్నాకరరావు (తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్) అధ్యక్షత వహించారు. భూపాల్ (తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్),
వేణు (1104 యూనియన్), వజీర్ (1535 యూనియన్), సురేష్ (327 యూనియన్), శ్రీనివాసరెడ్డి (తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసి యేషన్), తులసి నాగరాణి (ఎలక్ట్రిసిటీ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్), అనిల్ కుమార్ (అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్), గాంబో నాగరాజు (బీ-2871), చంద్రుడు (బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్), చంద్రశేఖర్ (ఎస్సీ, ఎస్టీ దళిత్ క్రిష్టియన్ ఎంప్లాయీస్ అసోసియేషన్), సంపత్‌రెడ్డి (ఓసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్), కరుణాకర్‌రెడ్డి (అక్కౌంట్స్ స్టాఫ్ అసోసియేషన్), రాంజీ (ఎస్టీ ఎంప్లాయీస్ వేల్ఫేర్ అసోసియేషన్) సహా పలు సంఘాల నాయకులు మాట్లాడారు. విద్యుత్‌రంగాన్ని పూర్తిగా ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పార్లమెంటులో సవరణ బిల్లును ప్రవేశపెట్టే ప్రయ త్నం చేస్తున్నదని విమర్శించారు. ఆ బిల్లును రద్దు చేసేవరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తమ పోరాటానికి రైతాంగ ఉద్యమమే స్ఫూర్తి అని తేల్చిచెప్పారు. రైతుల ఆగ్రహజ్వాలలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను రద్దు చేసి, వారికి క్షమాపణలు చెప్పిందని గుర్తుచేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యుత్ సంస్కరణలపేరుతో పంపిణీ వ్యవస్థల్ని ప్రయివేటీకరించారని చెప్తూ, అక్కడి చేదు అనుభవాలను ప్రస్తావించారు. సేవాదృక్పధంతో ప్రభుత్వరంగంలో విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నాయనీ, వాటిని పూర్తిగా ప్రయివేటు వాణిజ్య కేంద్రా లుగా మార్చేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఎట్టి పరిస్థి తుల్లో దీన్ని ముందుకు సాగనివ్వబోమని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ, ఉద్యోగులకు అండగా నిలుస్తున్నదనీ, పార్లమెంటులో ఎంపీలు గళాన్ని మరింతఉధృతంగా వినిపించాలని కోరారు. విద్యుత్ సవరణ బిల్లు ప్రమాదాన్ని ప్రజలకు వివరిస్తూ, వారి మద్దతు కూడ గట్టాల్సిన బాధ్యత విద్యుత్ ఉద్యోగుల పైనే ఉన్నదని చెప్పారు. కేంద్రం చర్యల్ని ఉపేక్షిస్తే భవిష్యత్‌లో మరిన్ని కరెంటు కష్టాలు తప్పవనీ, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కూడా ఉండబోదని హెచ్చరించారు. అనంతరం ధర్నా ప్రాంతం నుంచి తెలంగాణచౌరస్తా వరకు విద్యుత్‌ఉద్యోగులు భారీనిరసన ప్రదర్శననిర్వహించారు.
విద్యుత్ సౌధలో...
టీఈఈజేఏసీ కన్వీనర్ ఎన్ శివాజీ నేతృత్వంలో విద్యుత్ సౌధలో ఉద్యోగులు, ఇంజినీర్లు భోజన విరామసమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సవరణ బిల్లు-2021ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభు త్వం విద్యుత్ ఉద్యోగులకు అండగా నిలుస్తున్నదని చెప్పారు. ఈ బిల్లు వల్ల రైతాం గం, విద్యుత్ వినియోగదారులకు తీవ్ర నష్టాలు జరుగుతాయని వివరించారు. కార్యక్రమంలో మహ్మద్ యూసుఫ్ (టీఆర్వీకేఎస్), జేఏసీ నాయకులు అంజయ్య, షరీఫ్, గణేష్‌రావు, రామేశ్వరగుప్తా, ఆరోగ్యరాణి తదితరులు పాల్గొన్నారు.