Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాక్‌లను వేలం వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) సింగరేణి బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు జక్కం. రమేష్, ఎన్వీ రాజశేఖర్‌రావు తెలిపారు. ఈ మేరకు వారు బుధవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. నాలుగు కోల్ బ్లాకులను వేలంలో పెట్టడం వల్ల, సంస్థ ఇప్పటి వరకు అన్వేషణ కోసం వెచ్చించిన కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాన్ని తప్పించేందుకు సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు తమ అసోసియేషన్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు.