Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో అడిషనల్ డీఎంఈ, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాళ్లు, ఆస్పత్రుల సూపరింటెండెంట్ల పదోన్నతుల అంశాన్ని కొలిక్కి తెచ్చినందుకు సీఎం కేసీఆర్ కు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుకు మెడికల్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ధన్యవాదాలు తెలపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యను సీఎం పరిష్కరించారని హర్షం వ్యక్తం చేశారు. తద్వారా వైద్యసిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలన్ని పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.