Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27న సీట్ల కేటాయింపు
- 30 నుంచి తరగతులు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు పీఈసెట్ ప్రవేశాల కన్వీనర్ పి రమేష్‌బాబు బుధవారం షెడ్యూల్ విడుదల చేశారు. గురువారం నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. ఈనెల 11 నుంచి 19 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్‌తోపాటు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు.
ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులైన ఎన్సీసీ, క్యాప్, క్రీడల కోటాకు సంబంధించి 18 నుంచి 20 వరకు భౌతికంగా ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని పేర్కొన్నారు. 22న అర్హులైన అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తామని తెలిపారు. 24, 25 తేదీల్లో వెబ్ఆప్షన్లు నమోదు చేయాలని సూచించారు. 27న సీట్లు కేటాయిస్తామని వివరించారు. 28 నుంచి 30 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు. ఈనెల 30 నుంచి బీపీఈడీ, డీపీఈడీ తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీపీఈడీలో 1,787 మంది, డీపీఈడీలో 1,207 మంది కలిపి 2,994 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత పొందారని వివరించారు. 18 బీపీఈడీ కాలేజీల్లో 1,860 సీట్లు, డీపీఈడీలో 350 సీట్లు కలిపి మొత్తం 2,210 సీట్లున్నాయని తెలిపారు.