Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నిరంగాల్లో అమ్మాయిలు మనోధైర్యంతో ముందుకెళ్లాలి : ఎస్ఎఫ్ఐ గర్ట్స్ కన్వెన్షన్లో సామాజిక కార్యకర్త దేవి
నవతెలంగాణ-ఓయూ
సావిత్రి బాయి స్ఫూర్తితో అమ్మాయిలు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సామాజిక కార్యకర్త దేవి పిలుపునిచ్చారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) గర్ల్స్ కన్వీనింగ్ కమిటీ రాష్ట్ర 4వ కన్వెన్షన్ ఉస్మానియా యూనివర్సిటీ (ఐసీఎస్ఎస్ఆర్) కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా సామాజిక కార్యకర్త పి.దేవి హాజరై మాట్లాడారు. అమ్మాయిలు అన్ని రంగాలల్లో రాణించాలని, మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. వరకట్నాన్ని వ్యతిరేకించాలని సూచించారు. ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలకు రక్షణ కరువైందన్నారు. అమ్మాయిలు చదువుతోపాటు, పోరాటాలలో ముందుండాలని కోరారు. టీపీఎస్కె రాష్ట్ర కార్యదర్శి హిమబిందు మాట్లాడుతూ... అమ్మాయిల రక్షణకు ప్రభుత్వాలు ఎటువంటి శ్రద్ధా చూపట్లేదన్నారు. అమ్మాయిల రక్షణ కోసం వచ్చిన చట్టాలు ఉన్నోడికి చుట్టాలుగా పని చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి. తాళ్ల నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు మిశ్రీన్ సుల్తానా, పూజ, అరవింద్, ఉస్మానియా యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రవి నాయక్, విద్యార్థినులు పాల్గొన్నారు.