Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఆర్ఏల ఆత్మహత్యలను ఆపేలా చర్యలు తీసుకోవాలి
- వారం పాటు నిరసన కార్యక్రమాలు : వీఆర్ఏ సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఆర్ఏలకు పేస్కేలు అమలు చేయాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం(వీఆర్ఏ సంఘం)రాష్ట్ర గౌరవాధ్యక్షులు మోసంగి అంజయ్య, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.బాలనర్సయ్య, వంగూరు రాములు,ఉపాధ్యక్షులు సీహెచ్.రాజయ్య డిమాండ్ చేశారు. వీఆర్ఏల ఆత్మహత్యలను ఆపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్కార్‌కి విజ్ఞప్తి చేశారు. ఆ డిమాండ్లపై వారం పాటు వీఆర్ఏలు నల్లబ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.ఈ మేరకు వారు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.జగిత్యాల జిల్లాలో ఐదు నెలల కింద ఆదివారం రోజు విధు లు చేపట్టి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏ చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. గత 10రోజుల్లోనే ఆర్థిక ఇబ్బందులతో ముగ్గురు వీఆర్ఏలు ఆత్మహత్య చేసుకున్నారనీ,ఇసుక మాఫియా చేతిలో ఒకరు హత్యకు గురయ్యారని తెలిపారు.అవన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని పేర్కొన్నారు.వాటికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.24గంటలు విధులు చేయాలని అధికారుల ఒత్తిడి, జాబ్ చార్ట్ లేకపోవడం వీఆర్ఏల చావులకు కారణం అవుతున్నాయని తెలిపారు. అనా రోగ్యం పాలైతే ఆస్పత్రుల్లో చూపించుకునేందుకు హెల్త్ కార్డులు కూడా లేవని వాపోయారు.అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగానే పేస్కేలు, వార సులకు ఉద్యోగం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఐక్య కార్యాచరణ చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.