Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం
- మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదంలో మరణించిన మక్తల్‌కు చెందిన ఏఎన్ఎం వరలక్ష్మి కుటుంబానికి రూ.50 లక్షల బీమా సొమ్మును అందజేయనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. ఆమె కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించాలని జిల్లా వైద్య శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. వరలక్ష్మి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. విధి నిర్వహణలో భాగంగా నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం వడ్వాట్ గ్రామ స్టేజీ వద్ద లారీ ఢకొీని వరలక్ష్మి మృతి చెందింది.