Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతదేహాన్ని కొంతదూరం ఈడ్చుకెళ్లిన లారీ
నవతెలంగాణ - మాగనూరు
లారీ ఢకొీని ఎఎన్ఎం మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు మక్తల్ మండల కేంద్రానికి చెందిన వరలక్ష్మి (40) పక్క మండలమైన మాగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో భాగంగా వ్యాక్సిన్ వేసేందుకు గానూ మండలంలోని కొల్పూర్ గ్రామానికి స్కూటిపై వెళ్తుంటారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో ఎదురుగా వేగంగా వస్తున్న లారీ స్కూటీని ఢకొీట్టగా ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. అయితే స్కూటీపై ఉన్న ఎఎన్ఎంను లారీ కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్ లారీని పక్కకు ఆపి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న మక్తల్ ఎస్ఐ రాములు, వైద్యాధి కారులు, ఆరోగ్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆస్పత్రికి చేరుకుని ఆమె మృతదేహానికి పూలమాలలు వేసి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే ఆమె కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవా లని కోరుతూ సీఐటీయూ, డీవైఎఫ్ఐ, ఏఐటీయూసీ నాయకులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. స్పందించిన జిల్లా వైద్యాధికారి రామ్ మనోహర్ రావు లక్ష ఇస్తామని, ముందుగా అంత్యక్రియల కోసం రూ.25లు అందజేశారు. జిల్లా మంత్రి రూ.50 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే విధి నిర్వహణలో మృతి చెందిన ఎఎన్ఎం కుటుంబానికి రూ.50 లక్షలు ఇస్తామని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మెసెజ్ ద్వారా తెలిపారు. అనంతరం నాయకులు, సిబ్బంది మృతదేహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. వారిలో సీఐటీయూ జిల్లా నాయకులు అంజనేయులు, నరేష్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బాలు, రాఘవేంద్ర, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కొండన్న తదితరులున్నారు.