Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రాన్స్‌కో సీఎండీకి ఎలక్ట్రిసిటీ స్టోర్ వర్కర్స్ యూనియన్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యుత్ స్టోర్లలో లోడింగ్-అన్లోడింగ్ పనులు నిర్వహించే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ స్టోర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ట్రాన్స్‌కో సీఎండికి వినతి పత్రాన్ని సమర్పించారు. అందజేశారు. విద్యుత్ స్టోర్లలో గత 20 ఏండ్లుగా 220మంది లోడింగ్-అన్లోడింగ్ కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి ఏ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావటం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వారిని ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు విధానం రద్దు చేయాలనీ, కార్మికులందరినీ నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.పీఎఫ్‌కు ప్రభుత్వం చెల్లించే వాటా, కార్మికుడి వాటా రెండూ కార్మికులే చెల్లిస్తున్నారనీ, దీన్ని సరిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కత్తుల యాదయ్య, బిక్షం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.