Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌కు టిప్స్, జీసీసీఎల్‌ఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475) డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంత్రులు టి హరీశ్‌రావు, వి శ్రీనివాస్‌గౌడ్‌ను గురువారం హైదరాబాద్‌లో టిప్స్ కన్వీనర్ మాచర్ల రామకృష్ణగౌడ్, సమన్వయకర్త ఎం జంగయ్య, జీసీసీఎల్‌ఏ అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన జీవో నెంబర్ 16పై ఉన్న పిల్‌ను హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. అందుకనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. లోకల్ క్యాడర్లో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులకు సొంత జిల్లాలకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. క్రమబద్ధీకరణకు సంబంధించి త్వరలోనే న్యాయం జరుగుతుందని మంత్రులు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అనంతరం ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్‌ను కలిశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య, వస్కుల శ్రీనివాస్, కెపి శోభన్‌బాబు, శైలజ, గణపతి, విజయమోహన్, మల్లన్న తదితరులు పాల్గొన్నారు.