Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది
- ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
నవతెలంగాణ- విలేకరులు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం జరగనున్న ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సామగ్రిని పోలింగ్ సిబ్బందికి అప్పగించారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగనుంది. కౌంటింగ్ ఈనెల 14న నిర్వహిస్తారు. నల్లగొండ, సూర్యా పేట, భువనగిరి జిల్లాల్లో 1278 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఏడు ఖాళీలు ఉన్నాయి. దీనికిగాను నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, భువనగిరి, చౌటుప్పల్‌లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను డీఆర్డీఏ భవన్లో భద్రపరుస్తారు. మూడు జిల్లాల కలెక్టర్లు, జేసీలు పోలింగ్ సెంటర్లను పరిశీలించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ శాసనమండలి స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 8 పోలింగ్ కేంద్రాల్లో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో రెండేసి చొప్పున ఏర్పాటు చేశారు. 937మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ నిర్వహణ కోసం 64మంది అధికారులను నియమించారు. బందోబస్తు కోసం 800మంది పోలీసులను ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి సిక్తాపట్నాయక్ పర్యవేక్షణలో పోలింగ్ అధికారులు, సిబ్బంది ఆయా కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులతో తరలివెళ్లారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి దండె విఠల్, స్వతంత్ర అభ్యర్థిగా పెందూర్ పుష్పారాణి బరిలో ఉన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో సంగారెడ్డిలో నాలుగు, మెదక్‌లో మూడు, సిద్దిపేటలో రెండు పోలింగ్ కేంద్రాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,026 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ సందర్భంగా బందోబస్తు కోసం 463 పొలీసు సిబ్బందిని నియమించారు. టీఆర్ఎస్ నుంచి యాదవరెడ్డి, కాంగ్రెస్ నుంచి నిర్మలా జగ్గారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా మట్ట మల్లారెడ్డి బరిలో ఉన్నారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్‌కు జిల్లా రిటర్నిం గ్ అధికారి, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేశారు. నలుగురు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు సహా మైక్రో అబ్జర్వర్లనూ నియమించారు. కరీంనగర్, హుజూరా బాద్, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, మంథని, సిరిసిల్లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 1324మంది ఓటర్లుఉన్నారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు, మరో8మంది స్వతంత్య్ర అభ్యర్థులుఉన్నారు.
ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి తాతా మధుసూదన్‌రావు, కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు, ఎంపీటీసీల సంఘం నుంచి కొండపల్లి శ్రీనివాసరావు, ఆది వాసీల సంఘాల తరఫున కొండ్రు సుధారాణి పోటీ చేస్తు న్నారు. 768మందికి ఓటు హక్కు ఉంది. 9మంది ఎక్స్ అఫిషియో సభ్యుల్లో ఆరుగురు ఖమ్మం, ఒకరు కల్లూరు, ఇద్దరు కొత్తగూడెంలో ఓటు హక్కు వినియోగించు కోనున్నారు.