Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయండి
- రాష్ట్ర రైతులకు మంత్రి నిరంజన్‌రెడ్డి లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలను అర్ధం చేసుకుని వచ్చే యాసంగి సీజన్లో వరికి బదులుగా ఇతర పంటలు మాత్రమే సాగు చేయాలని రైతులకు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం ఇచ్చే, మార్కెట్లో డిమాండ్ ఉండే పప్పు గింజలు, నూనెగింజలు వంటి పంటలను సాగు చేయడం ద్వారా అధిక ఆదాయం పొందాలని సూచించింది. ఈమేరకు గురువారం రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలను పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా రైతాంగాన్ని అప్రమత్తం చేస్తూ... ఆరుతడి పంటల వైపు వారిని మళ్లించేందుకు ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు. యాసంగి వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉందని తెలిపారు. ఈ యాసంగి నుంచి బాయిల్డ్ రైస్ సేకరణ ఉండబోదని స్పష్టంగా ప్రకటించిందని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ, వరి సాగు విషయంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్ భిన్న వాదనలతో తెలంగాణ రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్నారని వివరించారు.