Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిగురువారం ఆర్టీసీ బస్డేలో సజ్జనార్
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని టీఎస్ ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్ ప్రయాణీలకు విజ్ఞప్తి చేశారు. సంస్థ అభ్యున్నతి కోసం తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. గురువారం హైదరాబాద్ లో తన నివాసం నుంచి కాలినడకన లక్డికాపుల్ మీదుగా టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకున్న ఆయన, అక్కడ బస్సు ఎక్కి బస్‌భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బస్సుల సమయపాలన, సిబ్బంది ప్రవర్తన, పనితీరు, బస్సుల్లో శుభ్రత, సౌకర్యాలు, కార్గో సేవల గురించి ప్రయాణీకుల నుంచి అభిప్రాయా లను స్వీకరించినట్టు తెలిపారు. తనతోపాటు బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులతో మాట్లాడి వారి సూచనలు, సలహాలను తీసుకున్నట్టు వెల్లడించారు. తాను ప్రయాణించిన బస్సు డ్రైవర్, కండక్టర్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. బస్సులోనే ప్రయాణించడం ద్వారా ప్రయాణికుల అభిప్రాయాలూ, అవసరాలు తెలుసుకునే వీలుంటుందనే 'ప్రతి గురువారం బస్‌డే' పాటిస్తున్నట్టు సజ్జనార్ తెలిపారు.