Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన సచివాలయ నిర్మాణంపై సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నూతన సచివాలయ నిర్మాణానికి సంబంధించి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీపడొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మాణ సంస్థలను, ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో ఉన్న సెక్రటేరియట్ల నిర్మాణాలను పరిశీలించాలని ఆయన సూచించారు. సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పరిశీలించారు. వాటి పురోగతిపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. నూతన సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా, దేశం గర్వపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయటం ద్వారా దాన్ని త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. సీఎం వెంట మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఆ శాఖ ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్‌తేజ తదితరులున్నారు.