Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా జూలకంటిరంగారెడ్డి
- ప్రధాన కార్యదర్శిగా టి సాగర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ కౌన్సిల్ సమావేశాలు జనవరి 10,11,12 తేదీల్లో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్నాయి. ఈ సమావేశాలను జయప్రదం చేసేందుకు వీలుగా గురువారం ఎస్వీకేలో తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పి జంగారెడ్డి అధ్యక్షతన జాతీయ కౌన్సిల్ సమావేశాల విజయవంతం చేసేందుకు ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనికి గౌరవాధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె నాగేశ్వర్, అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా టి సాగర్, కోశాధికారిగా బొంతల చంద్రారెడ్డి, ఉపాధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహ్మరెడ్డి, పి జంగారెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై 10న 'జాతీయ సదస్సు' నిర్వహిస్తామనీ, అందులో వ్యవసాయ రంగ నిపుణులు పాలగుమ్మి సాయినాథ్, ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ధావలే, హన్నన్మొల్లా, మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ ప్రసంగిస్తారని తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి కొట్టడంలో రైతులు రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. వారి ఉద్యమ స్ఫూర్తితో మద్దతు ధరల చట్టం సాధించడానికి ఉధృత పోరాటాలు చేయా ల్సిన అవసరం ఉందన్నారు. ఎంఎస్పీ చట్టంతో రైతులకు మేలు జరుగుతుం దన్నారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు, పత్తి, మిర్చి రైతులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారి పక్షాన పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. టి.సాగర్ మాట్లాడుతూ మూడు వ్యవసాయ చట్టాల ను ఉపసంహరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతాంగ పోరాటం సాధించిన చారిత్రాత్మక విజయమన్నారు. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిన కారణంగానే మోడీ సాగు చట్టాల రద్దు ప్రకటన చేశారని తెలిపారు. రైతాంగ ఉద్యమంలో 700 మంది రైతులు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎస్పీపై కొత్త చట్టాన్ని పార్లమెంట్ ముందుకు తీసుకురా వాలనీ, విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతాంగ ఉద్యమం భవిష్యత్తు కార్యచరణపై చర్చించడానికి వీలుగా హైదరాబా ద్లో అఖిల భారత కిసాన్ సభ జాతీయా కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అరిబండి ట్రస్టు ద్వారా జాతీయ కౌన్సిల్ సమావేశాలకు ఆర్థిక సాయాన్ని ట్రస్టు చైర్మెన్ అరిబండి ప్రసాదరావు ప్రకటించారు.