Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని బీసీ సంక్షేమ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్లో తన కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల సోసైటీ రీజినల్ కోఆర్డినేటర్ల సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనీ, పోషకాహారలోపాలు తలెత్తకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. రీజనల్ కోఆర్డినేటర్ ప్రతినెలలో తప్పని సరిగా నాలుగు రోజులపాటు పాఠశాలలో నైట్ హాల్ట్ చేయాలనీ, ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. విద్యార్థుల సంక్షేమమే ప్రథమ ధ్యేయంగా పనిచేయాలని తెలిపారు.
మట్టి గణపతుల విగ్రహాల తయారీలో శిక్షణ
బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల విగ్రహాల తయారీలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు కార్పొరేషన్ ఎండీ అలోక్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13నుంచి హన్మకొండలో నిర్వహించే ఈ కార్యక్రమంలో 200మంది కుమ్మరి వారికి శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రొత్సాహంతో గతంలో 50 మంది కుమ్మరులకు మట్టి గణేష్ విగ్రహాల తయారీలో శిక్షణనిచ్చినట్టు తెలిపారు. వారంతా ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాలు తయారు చేసి ఆర్థికంగా లబ్దిపొందారని పేర్కొన్నారు.