Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ శ్రేణులకు రేవంత్‌రెడ్డి పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అనుకున్న సమయంలోపు 30 లక్షల సభ్యత్వాన్ని చేర్పించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మల్కాజిగిరి పార్లమెంట్ కార్యాలయంలో ఆయన సభ్యత్వంపై సమీక్షించారు. పార్టీ నేతలు హర్కర వేణుగోపాల్, దీపక్ జాన్, వేం నరేందర్‌రెడ్డి, మల్లురవి, అయోధ్యరెడ్డి, బెల్లయ్యనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డిజిటల్ మెంబర్షిప్ పెద్దఎత్తున ప్రారంభమైందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో సభ్యత్వ నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయనీ, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించి సభ్యత్వ నమోదు సజావుగా సాగేలా చూడాలని సూచించారు. కేసీఆర్ పాలనలో రైతు కుటుంబాల దీనస్థితికి రవికుమార్ ఆత్మహత్యే ఒక నిదర్శనమని రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. 'పంటకు ధర లేదు.బిడ్డకు ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. వృద్ధులకు పెన్షన్ లేదు' అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం రైతుల బొందల గడ్డగా మారే వరకు ముఖ్యమంత్రి స్పందించరా? అని నిలదీశారు.
రవికుమార్ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం :అన్వేష్‌రెడ్డి
మెదక్ జిల్లాలో హావేలి ఘనపూర్ మండలానికి చెందిన రవికుమార్ అనే రైతు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రభుత్వమే కారణమని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మెన్ సుంకేట అన్వేష్‌రెడ్డి పేర్కొన్నారు. యాసంగిలో వరి వేయొద్దంటూ అధికారులు రైతులను ఒత్తిడి చేయడం వల్లే రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. తన ధాన్యాన్ని అమ్మి 15 రోజులైన ఇంతవరకు డబ్బులు రాలేదని తెలిపారు.