Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు సీఎస్ అదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమాన్ని (ఎస్ఎన్డీపీ) మరింత వేగ వంతం చేయా లని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ చెప్పారు. శుక్రవారంనాడాయన ఎస్ఎన్డీపీ పై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్తో పాటు ఇంజినీర్ ఇన్ చీఫ్, జోనల్ కమిషనర్లు దీనిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎన్డీపీ నిర్వహణ, అడ్డంకులు, పరిష్కారాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రతివారం ఈ కార్యక్రమాన్ని సమీక్షించాలనీ, డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాంతంలో జరుగుతున్న పనులను రోజువారీ రివ్యూ చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారాన్ని సమన్వయంతో చేపట్టాలని చెప్పారు. ప్రతి గురువారం తానే స్వయంగా దీనిపై సమీక్ష చేస్తాననీ, క్షేత్రస్థాయిలో కూడా పర్యటిస్తానని ఆయన తెలిపారు.