Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 207 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 38,467 మందికి టెస్టులు చేశామని కోవిడ్-19 మీడియా బులెటిన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. మరో 3,044 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,897 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎమ్సీలో అత్యధికంగా 82 మందికి కరోనా సోకింది. రిస్క్ దేశాల నుంచి శుక్రవారం 668 మంది రాష్ట్రానికి చేరుకున్నారు. వీరికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రానికి ఇప్పటి వరకూ 3,235 మంది చేరుకోగా వారిలో 15 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టు అధికారులు తెలిపారు. అయితే వీరికి సోకిన వేరియంట్ ఒమిక్రానేనా..? కాదా..? అనేది తేలాల్సి ఉంది. ఇందుకోసం నమూనాలను జీనోమ్ స్వీక్వెనింగ్కు పంపారు. సంబంధిత రిపోర్టులు మరో రెండు రోజుల్లో రావచ్చని అంచనా. అప్పటి వరకూ వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని వైద్యశాఖ వర్గాలు తెలిపాయి.