Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ రంగంలో విస్తృతావకాశాలు :అపోలో గ్రూపు జాయింట్ ఎండి సంగీతా రెడ్డి
హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్పెషాలిటీ టెలిమెడిసిన్ నెట్వర్క్ కలిగిన అపోలో టెలీహెల్త్ (ఏటీహెచ్)కు బ్రిటిష్ స్డాండర్డ్ ఇన్స్ట్యూషన్ (బీఎస్ఐ) నుంచి ఐఎస్ఒ 13131:2021 గుర్తింపు లభించింది. వైద్య రంగంలో వినూత్న కల్పనలకు మద్దతుగా ఈ గుర్తింపును ఇస్తారు. ఈ సందర్బంగా శుక్రవారం హైదరాబాద్‌లో అపోలో హాస్పిటల్స్ గ్రూపు చైర్మెన్ ప్రతాప్ సి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము అత్యుత్తమ విధానాలను అనుసరించినందునే తమకు ఈ విశేష గుర్తింపు లభించిందన్నారు. దేశ, విదేశాల్లో తమ సంస్థ కోట్లాది మంది ప్రజలకు వైద్య సంరక్షణను అందిస్తోందన్నారు. ఈ క్రమంలోనే టెలీహెల్త్ సేవల నాణ్యతకు హామీ ఇచ్చేలా చూసేందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్నామన్నారు. సుధీర గ్రామీణ ప్రాంతాలకు సైత సురక్షిత ఆరోగ్య సంరక్షణను అందించేందుకు ఇలాంటి విధానాలు అవసరమన్నారు. ఆ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి మాట్లాడుతూ టెలీహెల్త్ మెడిసిన్ రంగం బహుళ రెట్ల వృద్థిని నమోదు చేస్తుందన్నారు. ప్రపంచంలో ఈ మార్కెట్ 38 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. పెట్టుబడులకు విస్తృతావకాశాలు ఉన్నాయన్నారు. టెలిమెడిసన్ విభాగంలో ఇప్పటి వరకు తాము 1.3 కోట్ల మంది సేవలు అందించామన్నారు. ప్రస్తుతం 800 పైగా పబ్లిక్ హెల్త్ సెంటర్లు, 100కు పైగా ఫ్రాంచైజీలు, 3.50 లక్షల కామన్ సర్వీస్ సెంటర్స్‌తో ఎటిహెచ్ సేవలందిస్తుందన్నారు.