Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫాగింగ్ మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్ రగడ
- మంత్రి సబితారెడ్డి ముందు టీఆర్ఎస్ నాయకుల రభస
- ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వాగ్వివాదం
- సర్ది చెప్పిన మంత్రి
నవతెలంగాణ-తాండూరు
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య కొనసాగుతున్న గ్రూపుల తగాదాలు బయటపడ్డాయి. శుక్రవారం తులసి గార్డెన్లో ఏర్పాటు చేసిన ఫాగింగ్ మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్ వివాదం ఏర్పడింది. తన వార్డులో కార్యక్రమం చేస్తూ తమను అవమానపరచడం ఎంతవరకు సమంజసమని కౌన్సిలర్ నీరజ బాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి పిలిచి కుర్చీలు కూడా వేయకపోవడంతో తాండూరు మున్సిపల్ కౌన్సిలర్లు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, వర్గీయులు నువ్వెంత అంటే నువ్వెంత అని బాహాబాహీకి దిగారు. వేదికపై మంత్రి పక్కనే కూర్చున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా వాగ్వివాదం చేసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను పిలిచి అవమాన పరచడం సరైన పద్ధతి కాదని మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించడం లేదంటూ తాండూరు మండలం గౌతాపూర్ ఎంపీటీసీ సాయిరెడ్డి, అంతారం సర్పంచ్ రాములు, టీఆర్ఎస్ పెద్దేముల్ మండల అధ్యక్షులు కోహీర్ శ్రీనివాస్, నాయకులు ప్రవీణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని గ్రామాలకు సంబంధించిన కార్యక్రమానికి మున్సిపాలిటీ వారు స్టేజిపైకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అయితే, గ్రామాలకు సంబంధించిన కార్యక్రమానికి తమను ఎందుకు పిలిచారని ఎమ్మెల్సీ వర్గం నాయకులు పట్లోళ్ల నర్సింలు, వడ్డె శ్రీనివాస్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ వైస్ చైర్పర్సన్ రత్నమాల నర్సింలు, సీనియర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి వారిని నిలదీశారు. దీంతో కాసేపు ఘర్షణ వాతావ రణం నెలకొంది. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశా రని, ఎవరు చేయమన్నారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరు గ్రూపుల నాయకులకూ మంత్రి సర్ది చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారం కార్యక్రమానికి సంబం ధించిన సమాచారాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకు ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు.