Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హత్య చేసి తలతో పోలీస్‌స్టేషన్‌కు..
- మరో భర్త పరార్..
నవతెలంగాణ- రాజేంద్రనగర్/ కూకట్పల్లి
హైదరాబాద్‌లో మహిళలపై దారుణ ఘటనలు చోటుచేసుకు న్నాయి. భార్యలపై అనుమానంతో అతి కిరాతకంగా హత్య చేశారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటనలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో శుక్రవారం చోటుచేసుకున్నాయి. పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని యద్నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ పర్వేజ్, సమ్రీన్ బేగమ్(28)కు 14 ఏండ్ల కిందట పెండ్లయింది. వీరికి ముగ్గురు పిల్లలు. పర్వేజ్ స్థానికంగా పట్రోల్ పంపులో పనిచేస్తున్నాడు. కొనేండ్లుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పోలీస్‌స్టేషన్‌కు సైతం వెళ్లినా గొడవలు సద్దుమణగకపోవడంతో రెండేండ్ల కిందట విడాకులు తీసుకున్నారు. అయితే, మనసు మార్చుకున్న భర్త పర్వేజ్.. ఇక నుంచి గొడవలు జరగకుండా చూసుకుంటానని సర్ధిచెప్పి ఏడాది కిందట సమ్రీన్ను మళ్లీ పెండ్లి చేసుకున్నాడు. కొన్నిరోజుల నుంచి మద్యానికి బానిసై వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ గొడవకు దిగాడు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నిద్రిస్తున్న సమ్రీన్ బేగమ్‌ను అతి దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. ఆపై కత్తితో తలను వేరు చేసి దానితో అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. భార్యపై అనుమానంతోనే హత్య చేశానని పోలీసులకు తెలిపాడు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, రాజేంద్రనగర్ సీఐ కనకయ్య వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం సిబ్బంది పరిశీలించి పలు ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంతోష్‌కు పుణ్యవతితో గత మే నెలలో వివాహం జరిగింది. ముసాపేటలో ఉన్న సొంతింట్లో సంతోష్ వాళ్ల తల్లిదండ్రులు ఉంటుండగా.. సంతోష్ తన భార్యతో విడిగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సంతోష్ వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. పెండ్లయి ఏడాది కూడా అవ్వకుండానే భార్య ఎవరితో మాట్లాడినా తరుచూ అనుమానిస్తూ గొడవపడేవాడు. గతంలో కూడా వీరి మధ్య ఘర్షణ తలెత్తడంతో పెద్దల సమక్షంలో నచ్చజెప్పారు. కాగా గురువారం సాయంత్రం నుంచి సంతోష్ ఉండే ఇంటికి తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చిన పక్కింటివారు దగ్గర్లోనే నివాసం ఉంటున్న అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి చూడగా అనుమానాస్పదంగా అనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చూడగా లావణ్య డెడ్‌బాడీ కనిపించింది. క్లూస్‌టీమ్‌ను తెప్పించి పరిశీలించిన పోలీసులు భర్తే ఆమెను గొంతు నులిమి చంపినట్టు నిర్ధారించారు. పరారీలో ఉన్న మృతురాలి భర్త సంతోష్కోసం గాలిస్తున్నట్టు కూకట్పల్లి పీఎస్ సీఐ నర్సింగ్‌రావు తెలిపారు.