Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం హామీ ప్రకారం పేస్కేలు అమలు చేయాలి
- కలెక్టరేట్ వద్ద వీఆర్ఏల ధర్నా.. సీఐటీయూ సంఘీభావం
నవతెలంగాణ-కంఠేశ్వర్
వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం వివక్ష వీడనాడాలని, సీఎం హామీ ప్రకారం పేస్కేలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీఐటీయూ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం వీఆర్ఏలకు పే-స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలన్నారు. పీఆర్సీ రికమెండేషన్ ప్రకారం కనీస వేతనం రూ.1,9000 పెంచాలన్నారు. వీఆర్ఏలందరికీ సొంత గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించాలని కోరారు. అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలన్నారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చి ఏడాదైనా అతీగతీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు, సీఐటీయూ నాయకులు ఎ.రమేశ్‌బాబు, పెద్దివెంకట్రాములు పాల్గొన్నారు.