Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం ఇస్తున్నది 17 నుంచి 19 శాతమే : మంత్రి సత్యవతి రాథోఢ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంగన్వాడీలకు జూలై నెల నుంచి పెంచిన వేతనాలను డిసెంబర్ జీతంతో కలిపి ఖాతాల్లో జమ చేస్తున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లోని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్లో మంత్రి సమీక్ష చేశారు. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీల వేతనాలను 2018 సెప్టెంబర్లో ఒకసారే పెంచిందని తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ వారి వేతనాలను మూడు సార్లు పెంచారని చెప్పారు. 2021 సెప్టెంబర్ జీవో నెంబర్ 47 ద్వారా అంగన్వాడీ టీచర్ల వేతనాలను రూ.10,500 నుంచి 13,650కు, అంగన్వాడీ హెల్పర్లు, మినీ అంగన్వాడీ టీచర్ల వేతనాలను రూ.6 వేల నుంచి 7,800కి పెంచిందని వివరించారు. బీజేపీ అధికారంలోకి రాకముందు అంగన్వాడీల వేతనాల్లో కేంద్రం, రాష్ట్ర వాటాలు గతంలో 90:10 శాతం చొప్పున ఉండేవన్నారు. మోడీ సర్కారు ప్రస్తుతం దాన్ని 60 శాతానికి తగ్గించిందని విమర్శించారు. అందులోనూ తిరకాసు పెట్టి దాన్ని 17 నుంచి 19 శాతమే ఇస్తున్నదని వివరించారు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే వేతనాల్లో రాష్ట్రం వాటా 80 శాతం, హెల్పర్ల వేతనాల్లో 82 శాతం ఉందని తెలిపారు. ప్రస్తుతం పెంచిన వేతనాల వల్ల 67,411 మంది అంగన్వాడీ ఉద్యోగులు లబ్ది పొందుతారన్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని, ఆ పార్టీ నేతల అసత్య ప్రచారాన్ని అంగన్వాడీలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.